Ganesh Chaturthi 2019 : Ganesh Songs Sentiment In Telugu Movies | Filmibeat Telugu

2019-08-31 8

This festival is celebrated with enthusiasm and zeal in Maharashtra and especially in Mumbai. There are a lot of movies with sequences around this festival. Usually, these sequences come along with songs which capture the flavour of this festival to the core.
#GaneshChaturthi
#GaneshChaturthi2019
#ganeshsongs
#happyvinayakachaviti
#tollywood
#jaichiranjeeva
#coolieno1
#dictatormovie
#devdas
#pokiri

హిందూ సంప్రదాయం ప్రకారం వినాయకుడిని ఆది దేవుడు అంటారు. అందుకే ఆయన పూజతోనే అన్ని పనులు ప్రారంభిస్తారు. అది ఏ రంగమైనా సరే..గణపతి పూజ ఉండాల్సిందే. ఇక, సెంటిమెంట్లు ఎక్కువగా ఫాలో అయ్యే సినిమా రంగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. తమ సినిమా ప్రారంభం రోజు గణపతి పూజ చేసి షూటింగ్ స్టార్ట్ చేసేస్తారు. చాలా మందైతే.. ప్రత్యేకంగా ఆయనకు సంబంధించిన పాటలు, సన్నివేశాలు పెట్టుకుంటారు. ఇలా ఎన్నో సినిమాల్లో గణేష్ పాటలు సందడి చేశాయి. వీటిలో చాలా వరకు హిట్ చిత్రాలుగా నిలిచాయి.వినాయక చవితి వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త సందడి మొదలవుతుంది. గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఇలా ఎక్కడ చూసినా గణేష్ పాటలతో సందడి మొదలవుతుంది. ప్రతి గల్లీలోని ఒక విఘ్నేశ్వరుడు వెలుస్తాడు. ఆ లంబోదరుడి సేవలో నిమగ్నమైపోతారు. గణనాథుడిని ప్రతిష్టించడం దగ్గర నుంచి నిమజ్జనం చేసేంత వరకు చిన్నా పెద్దా చాలా బిజీ అయిపోతారు.

Videos similaires